పెళ్లి పీటలు ఎక్కబోతున్న వైఎస్ షర్మిల కుమారుడు? పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-12-06 09:35:00.0  )
పెళ్లి పీటలు ఎక్కబోతున్న వైఎస్ షర్మిల కుమారుడు? పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎప్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేది వైఎస్ షర్మిల కొడుకు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో, రాజరెడ్డి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ తెలుగు మీడియా సంస్థ తన X ఖాతాలో ‘వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. రాజారెడ్డిది రెడ్డి సామాజిక వర్గం కాగా, ప్రియా అట్లూరిది కమ్మ సామాజిక వర్గం అని సమాచారం’ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed