Y. S. Sharmila : నన్ను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుంది: మంత్రిపై షర్మిల ఫైర్

by Satheesh |   ( Updated:2023-06-26 16:19:53.0  )
Y. S. Sharmila : నన్ను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుంది: మంత్రిపై షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: షర్మిల రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి మంత్రి కేటీఆర్‌కు భయం పట్టుకుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవిస్తున్నాడని, తన తండ్రి(వైఎస్ఆర్) చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసేది తాను అని వెల్లడించారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక బంది పోట్ల రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతిని బయటపెట్టిందని, పోడు భూముల కోసం కొట్లాడిందని, నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేసింది షర్మిల రెడ్డి అని వివరించారు.

‘తెలంగాణ ప్రజల కోసం మేం చేస్తే మీరేం చేశారు చిన్న దొర? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొంటే.. మీరు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు ఆరు నెలలు మేలుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు. హామీలన్నీ నెరవేరుస్తామని గప్పాలు కొడుతున్నారని, ఇంత కాలం తెలంగాణ ప్రజల మీద మీ ప్రేమ ఏమైంది? అని ప్రశ్నించారు.

‘పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసి ఆత్మగౌరవాన్ని చంపింది మీరైతే.. పార్టీ పేరులోనే తెలంగాణను పెట్టుకొని ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ అని తెలిపారు. అధికార మదం తలకెక్కి చిన్న దొరకు అన్ని జోకులుగానే కనిపిస్తున్నాయని, ఎవరిది నమ్మకమో.. ఎవరు జోకర్లో వచ్చే ఎన్నికల్లో బయటపడుతుందిలే కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

BRS జలగల్లారా.. ఇంకెంత కాలం ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు: షర్మిల తీవ్ర విమర్శలు

BRS జలగల్లారా.. ఇంకెంత కాలం ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు: షర్మిల తీవ్ర విమర్శలు

Advertisement

Next Story

Most Viewed