- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y. S. Sharmila : జిత్తులమారి కేసీఆర్‌ది పూటకో మాట.. రోజుకో వేషం
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిత్తులమారి కేసీఆర్‌ది పూటకో మాట రోజుకో వేషం అని ధ్వజమెత్తారు. మేం కాంగ్రెస్ బీజేపీలకు ఏ, బీ టీమ్ కాదని తాము రైతులు, పేదల టీమ్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం ట్విట్టర్ వేదికగా షర్మిల రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీతో స్నేహం విషయంలో కేసీఆర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు పార్టీలతో కలిసి నటించే దొర సినిమాకు ఇచ్చే సర్టిఫికెట్ ఏ/బీ అని సెటైర్ వేశారు. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్.. మీరు ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు.
రుణమాఫీ అని 31 లక్షల మందిని మోసం చేసినందుకు రైతుల టీమ్ అవుతారా? 9 ఏళ్లలో 9 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా?, వరి వేస్తే ఉరి అని చెప్పినందుకు రైతుల పక్షామా? అని నిలదీశారు. మూడు ఎకరాల భూమి అని దళితులను, రిజర్వేషన్లు పేరుతో మైనారిటీలను, పోడు పట్టాల ఆశ చూపి గిరిజనులను, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న బీసీలను అణగదొక్కి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మీది ప్రజల పక్షం కాదు. ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరు చెప్పి.. తన్ని తరిమేస్తరన్న చోటే రాజకీయం చేసే మీరు.. తెలంగాణ ప్రజల పక్షం అంటే నమ్మెంత పిచ్చోళ్లు ఎవరు లేరని దుయ్యబట్టారు.
Also Read..
మీరే ఫోన్ చేసి కనుక్కోండి.. T-బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు