- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పూటకో మాట, గడికో హామీ.. అసలైన పగటి వేషగాడు KCR: షర్మిల తీవ్ర విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. ‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులంటూ కేసీఆర్ మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని ఆమె ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని ఆమె ప్రశ్నించారు. 3 కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఉద్యమ ఆకాంక్షను నమ్మి చేతుల్లో పెడితే నట్టేట ముంచిన దోపిడీ దొంగలు ఆయనే అని విమర్శలు చేశారు.
నీళ్లు అని చెప్పి ఫాంహౌజ్‌కి, నిధులని చెప్పి ఆయన ఖజానాకు, ఉద్యోగాలు అని చెప్పి ఆయన కుటుంబానికి ఎత్తుకుపోయిన మోసగాడు కేసీఆరే కదా అని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. బంగారు తునక అని చెప్పి రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి ఆ సొమ్ముతో దేశ రాజకీయాలు చేసే కేసీఆర్ ఈ శతాబ్దపు అసలైన దళారి అని విమర్శించారు.
బడి నుంచి సాగుబడి వరకు అన్ని ప్రాజెక్టులపై లక్ష కోట్ల కమీషన్లు తిన్న దోపిడీదారు ఆయనే అని మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలకు, అయినోళ్లకు అగ్గువకే 30 వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టిన ఆయన పాలన దళారి పాలన అని ఫైరయ్యారు. దొర గుడిని మింగితే ఆయన ఎమ్మెల్యేలు లింగాలనే మింగే దళారులని విమర్శించారు. కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో రూ.5 లక్షలు, దళితబంధులో రూ.3 లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రూ.3 లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30 శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులని ఆమె ఆరోపణలు చేశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుని తిరిగి, ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట, గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్ అని షర్మిల ధ్వజమెత్తారు. ఒకప్పుడు గంజి కేంద్రాలు ఏమో కానీ మీ నియంత పాలనలో గల్లికొక లిక్కర్ కేంద్రాలే మిగిలాయని విరుచుకుపడ్డారు. రైతు రాజ్యం ఉందని.. దొరల రాజ్యం నడుపుతూ, వెలుగుజిలుగులు వచ్చాయని.. అంధకారంలోకి నెట్టిన కేసీఆర్ దళారి పాలనను ప్రజలు బొంద పెట్టే ఘడియ దగ్గరపడిందని షర్మిల విమర్శల వర్షం గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు ఏంటో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. రూ.38,500 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.1.20 లక్షల కోట్లకు ఎలా పెంచాలి? ఇందులో రూ.70 వేల కోట్ల కమీషన్లు ఎలా తినాలి? అడిగినన్ని కమీషన్లు ఇచ్చే ‘మెగా’ మోసం చేసే కంపెనీలకు ఎలా కాంట్రాక్ట్ ఇవ్వాలి? అనేది నేర్పుతారా? అని షర్మిల మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు అని చెప్పి లక్ష ఎకరాలకే ఎలా ఇవ్వాలనేది నేర్పిస్తారా? ఇంజినీర్లను పక్కన పెట్టి సొంతంగా ఇంజినీర్లు ఎలా అవ్వాలనేది చెబుతారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పాత ఆయకట్టును కొత్త ఆయకట్టుగా ఎలా కనికట్టు చేయాలనేది, ప్రాజెక్ట్ కట్టిన మూడేండ్లకే ఎలా మునిగిపోవాలని, ప్రాజెక్ట్ మునిగింది అని మళ్లీ రిపేర్ల పేరుతో ఎలా దోచుకుతినాలనేవి నేర్పుతారా? అని షర్మిల ప్రశ్నించారు. ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డం పొడుగు మాటలు ఎలా చెప్పాలి, చూద్దామని వెళ్తే పోలీసులను పెట్టి ఎలా ఆపాలనేది విదేశీయులకు నేర్పుతారా? అని ఆమె ప్రశ్నించారు. విదేశాలు నేర్చుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ దేశమే నేర్చుకుంటుందని మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు వేశారు.
Also Read..