కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. తాలిబన్లకు అధ్యక్షుడు: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-05-28 11:58:12.0  )
కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. తాలిబన్లకు అధ్యక్షుడు: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఏనాడు రైతులను, రైతు సమస్యలను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ ఢిల్లీ హక్కలు కోసం ఉద్యమం చెస్తానని, కేంద్రం మెడలు వంచి పార్లమెంట్‌లో బిల్లును ఓడిస్తానని చెబుతున్నాడని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు కేసీఆర్ మద్దతు ప్రకటించడంపై ఆదివారం రియాక్ట్ అయిన షర్మిల.. పక్క రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమాలు చేసే మీరు స్వరాష్ట్రం హక్కుల కోసం ఏనాడైనా పార్లమెంట్‌లో కొట్లాడారా అని ప్రశ్నించారు.

ఢిల్లీ ప్రజల తరపున కేజ్రీవాల్ వచ్చినట్లుగా మీరు రాష్ట్ర ప్రజయోనాల నిమిత్తం ఎవరినైనా కలిశారా అని నిలదీశారు. మూడో కూటమి, ఫెడరల్ కూటమి అంటూ ప్రజల సొమ్ముతో రాజకీయం చేయడం తప్ప కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనం కోసం ఏనాడు మద్దతు అడిగింది లేదు.. ఉభయ సభల్లో ఉద్యమించింది లేదని మండిపడ్డారు. ఎమర్జెన్సీ పరిస్థితులు దేశంలో కాదు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతు లేకుండా పోయిందని.. రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని తాలిబన్లకు అధ్యక్షుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని రాష్ట్రానికి వస్తే నిధులు గురించి ఏ ఒక్కనాడు అడిగిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఉండి ప్రాణాలు కోల్పోతుంటే ఈ నియంత ప్రభుత్వానికి సోయి రావడం లేదని పండించిన ధాన్యానికి విలువ కరువై ఆ ధాన్యాన్ని తగలబెట్టుకునే స్థాయికి తెలంగాణ రైతులను తీసుకు వచ్చిన కేసీఆర్ సిగ్గుతో తలదించుకుని ఉరేసుకువాలని దుయ్యబట్టారు.

యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు అందులో సగం ధాన్యం కూడా కొనలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరి అని చెప్పినందుకు.. వరి వేశారని కొనకుండా కుట్ర చేస్తున్నారా అని నిలదీశారు. పక్క రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి, కిసాన్ సర్కారు అని దిక్కుమాలిన ప్రచారం చేసుకునే కేసీఆర్ దొరకు.. మన రాష్ట్రంలో రైతుల కోసం కనీసం సమీక్ష పెట్టే తీరిక కూడా లేదు. రైతులు రోడ్డెక్కినా.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా, కేసీఆర్ గారికి దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉందని విమర్శించారు.

Also Read..

ఎన్టీఆర్ శత జయంతిపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే

Advertisement

Next Story

Most Viewed