- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
31 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు మేమే కారణం: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని ఆమె కొనియాడారు. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌ను బలపరచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం సందర్భంగా మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద పెట్టేందుకు కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు మంగళవారం వెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్ మనవడు రాజారెడ్డి పెళ్లి కాబోతోందని, అందుకే తన తండ్రి సమాధి వద్ద ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్‌తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని కోరారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాని, అందువల్లే ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్సార్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించిందన్నారు. 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారని తెలిపారు. దీనికి కారణం తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ టీపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్‌కు ఇబ్బంది అయి ఉండేదన్నారు. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్‌కు కూడా ఉందన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ త్యాగానికి విలువ కూడా ఉందన్నారు. తమ త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్‌లో చేరమని కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందిందని, అందులో భాగంగానే బుధవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు షర్మిల తెలిపారు. ఒకట్రెండు రోజుల్రలో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని షర్మిల పేర్కొన్నారు.