రాహుల్ గాంధీ ప్రధాని కాగానే తొలి సంతకం ఆ ఫైల్ పైనే: YS షర్మిల కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-02-02 13:37:20.0  )
రాహుల్ గాంధీ ప్రధాని కాగానే తొలి సంతకం ఆ ఫైల్ పైనే: YS షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎష్ షర్మిల తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే సోదరుడు సీఎం జగన్‌పై, ఆయన పార్టీ వైసీపీపై విమర్శల వర్షం కురిపించిన షర్మిల.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే్క హోదా అంశాన్ని భూజాన ఎత్తుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎష్ షర్మిల ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో భాగంగా ఇవాళ షర్మిల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చిందని.. ఏపీని స్వర్ణాంధ్ర చేస్తామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీకి ఏపీకి దోహ్రం చేసిందని మండిపడ్డారు.

ఇచ్చిన హామీలు నేరవేర్చడమే కాకుండా చివరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కూడా ప్రైవేటీకరణ చేస్తోందని బీజేపీపై ధ్వజమెత్తింది. ఒక్క ఎంపీ సీటు లేకపోయిన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఏపీకి చట్ట ప్రకారం కల్పించిన హక్కని షర్మిల అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాన మంత్రి కాగానే ఆయన తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా కల్పించే ఫైల్ పైనే చేస్తారని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story