- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సామెత కేసీఆర్‌కు సరిగ్గా సెట్ అవుతుంది: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టుకు తట్టెడు మట్టి మోయని సీఎం కేసీఆర్.. తానే జలకళ తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నాడని, కష్టం ఒకరిదైతే.. ప్రచారం మరొకరిదని, ఈ సామెత అబద్ధాల కేసీఆర్‌కి సరిపోతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది వైఎస్సార్ అయితే.. ఆయన గప్పాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరు సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా ఉందని చురకలంటించారు. ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పే దద్దమ్మ ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని షర్మిల ప్రశ్నించారు. పడావు పడిన బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా అని విమర్శించారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులే.. నేడు కెసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు అని ఆమె చెప్పారు.
వైస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా సాగునీరు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి పేరు చెప్పి రూ.35 వేల కోట్లు మెక్కారే తప్పా ఒక్క ఎకరాను తడిపింది లేదని ధ్వజమెత్తారు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదని మండిపడ్డారు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి 9 ఏళ్లలో 35 శాతం కూడా పనులు కాలేదన్నారు. వెనుకబడిన జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరు చెప్పి కమీషన్లు దండుకున్న దొంగ కేసీఆర్ ఆని ఇరోపణలు చేశారు. మహానేత హయాంలో ‘మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్’ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన పెట్టి మైగ్రేషన్ వైపే మళ్లేలా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లయినా వలసలు ఆగలేదన్నారు. 15 లక్షల మంది పాలమూరు బిడ్డలకు బొంబాయి, దుబాయ్ కష్టాలు తీరలేదన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీదున్న ప్రేమ దొరకు పాలమూరు మీద లేకపోయిందన్నారు. ఉద్యమ సమయంలో పార్లమెంట్ కి పంపిన గడ్డ అని ఏనాడో దొర మరిచిపోయారని చురకలంటించారు.
Also Read: పది లక్షలు కాదు కనీసం పది ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు.. కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్