- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకులు మారాలంటే.. తెలంగాణలో మరో ఉద్యమం జరగాల్సిందే: YS షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని, దొరల పాలన మళ్లీ తిరిగి వచ్చిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు. లోటస్ పాండ్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవాల్లో ఆమె పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ ఏర్పాటైందని ఆమె అన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని చెప్పారు.
ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిన పార్టీ వైఎస్సార్ టీపీ అని ఆమె తెలిపారు. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాడింది తామేనని చెప్పుకొచ్చారు. సబ్బండ వర్గాలకు అండగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్ప చేసిన బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన పార్టీ తమదని ఆమె వెల్లడించారు. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు చేసినట్లు చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాల్సిందేనని షర్మిల పేర్కొన్నారు. ఈ సర్కారు మారితేనే ప్రజల బతుకులు మారుతాయని తెలిపారు.