- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR అంతటి అహంకార సీఎం చరిత్రలోనే ఎవ్వరూ లేరు: YS షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్.. అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా.. లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా?’’ అని ప్రశ్నించారు. నాడు వైఎస్ఆర్ రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిస్తే.. క్యాంప్ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను వింటే.. నేడు కేసీఆర్ చేస్తున్నది నియంత పాలన అని విరుచుకుపడ్డారు. ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని అన్నారు.
అధికార మత్తులో తమకు ప్రజా సమస్యలు కనిపిస్తలేవని.. ఇండ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే కళ్లు కనపడ్తలేవా అని నిలదీశారు. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదన్నారు. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు చెవిన పట్టవని మండిపడ్డారు. సర్కారు బడిలో సౌలతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు కానరావన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారన్నారు. ‘‘మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులే. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరు’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.