న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లా?: వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల

by Javid Pasha |
న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లా?: వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో : దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లు వేస్తారా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల బుధవారం ట్వట్టర్ వేదికగా ప్రశ్నించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఇదేనా అని ఆమె సీఎం కేసీఆర్ ను నిలదీశారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమే రైతులకు మీరిచ్చే భరోసానా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బందిపోట్లయిన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తే రైతులని కూడా చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. మద్దతు ధర అడిగితే, పంట కొనండని అడిగితే సంకెళ్లు వేస్తారా అని ధ్వజమెత్తారు. ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.

కేసీఆర్ ది రైతులకు భరోసానిచ్చే సర్కార్ కాదని, రైతుకు బేడీలు వేసే సర్కార్ అని విమర్శలు చేశారు. రైతును బర్బాద్ చేసే సర్కార్.. రారాజును తీవ్రవాది గా చూసే సర్కార్ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ చరిత్రలో రైతులను 3 సార్లు జైలుకి పంపిన చరిత్ర కేసీఆర్ దేనని తూర్పార పట్టారు. ట్రిపుల్ఆర్ అలైన్ మెంట్ అన్యాయని అడిగితే జైల్లో పెట్టిస్తారా అని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అసలు అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదని, భూములు మింగే దొర కేసీఆర్ ను అని ఆమె మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed