- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y. S. Sharmila : చిలక పలుకులు పలికిన కవిత.. ఇప్పుడు ఎక్కడ పాయే మీ చిత్తశుద్ధి..?
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవిత.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? అని ఇవాళ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే.. 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా..? కవిత అని ప్రశ్నించారు.
ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలని విమర్శించారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్‌లోనూ ప్రాధాన్యత దక్కలే అని చెప్పారు. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్‌లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించు.. అని విమర్శించారు.
లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు అని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పాపాన పోలేదన్నారు. నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలని, సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.