- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిడ్డ లిక్కర్ దందా.. కొడుకు రియల్ ఎస్టేట్ దందా.. KCR ఫ్యామిలీపై షర్మిల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి భార్యను అవమానించారని, వైఎస్సార్ బిడ్డను జైల్లో పెట్టారని, ఆయన ఇంతకు ఇంతా అనుభవిస్తారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంచల్ గూడ జైలు నుంచి మంగళవారం విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు పరిపాలన చేత కాలేదని విమర్శలు చేశారు. ఇచ్చిన ఒక్క హామీని అమలుచేయడం ఆయనకు చేతకాలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబీకులకు అవినీతి చేసి దోచుకోవడమే తెలుసని విరుచుకుపడ్డారు. ఆ కుటుంబానికి అవినీతి, కమీషన్లు తీసుకోవడమే వచ్చని ఆరోపించారు. బిడ్డ లిక్కర్ స్కాం, కొడుక్కు రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారని ధ్వజమెత్తారు.
సిట్ వద్దకు వెళ్ళి ఒక్క వినతిపత్రం ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో నెలకొందని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. పురుష పోలీసులు తనను తాకే ప్రయత్నం చేశారని, కొందరు మ్యాన్ హ్యాండ్ లింగ్ చేయాలని చూశారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగానే తనపై దాడి చేసిన పోలీసులను నెట్టేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను కుక్కలాగా.. తొత్తుల్లాగా వాడుకుంటున్నారని ఫైరయ్యారు. పోలీసులు తనను బెదిరించిన వీడియోలు బయటపెట్టకుండా, వారికి అనుకూలంగా ఉన్నవి సోషల్ మీడియాలో పెట్టారని మండిపడ్డారు.
జైల్లో ఉన్న తనను చూసేందుకు వచ్చిన తన తల్లితో కూడా పోలీసులు అలాగే ప్రవర్తించారని ఫైరయ్యారు. గతంలో మంత్రి హరీష్ రావు అధికారులను కొట్టారని, సీఎం కేసీఆర్ బూతులు తిట్టిన వీడియోలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరి వారినెందుకు జైల్లో పెట్టలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బోనులో బంధించినా పులి పులేనని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తమ పార్టీ అధ్వర్యంలో అఖిలపక్షం మద్దతుతో బుధవారం ఇందిరాపార్క్ వద్ద టీ సేవ్ పేరిట నిరుద్యోగ దీక్షను చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.