Pure EV-Arva Electric: అర్వా ఎలక్ట్రిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్యూర్ ఈవీ

by Maddikunta Saikiran |
Pure EV-Arva Electric: అర్వా ఎలక్ట్రిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్యూర్ ఈవీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్(EV) టూ వీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV) గ్లోబల్ మార్కెట్(Global Market)పై దృష్టి సాధించింది. మిడిల్ ఈస్ట్(Middle East), ఆఫ్రికా(Africa) దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి క్లారియన్ ఇన్వెస్ట్‌మెంట్(Clarion Investment) అనుబంధ సంస్థ అర్వా ఎలక్ట్రిక్‌(Arva Electric)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే రెండేండ్లలో 50 వేల యూనిట్ల ఎకోడ్రైఫ్ట్‌(ecoDryft), ఈట్రిస్ట్ ఎక్స్‌(eTryst X) ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎగుమతి చేయనుంది. ఆ తర్వాత నుంచి ఏడాదికి 60,000 యూనిట్లను సరఫరా చేయనున్నట్లు సమాచారం.

ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నిశాంత్ డొంగరి(Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం విక్రయాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అక్కడి మార్కెట్లలో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎకోడ్రైఫ్ట్‌ ఈవీ ప్రారంభ ధర రూ. 1,19,999(Ex-Showroom) ఉండగా.. ఈట్రిస్ట్ ఎక్స్‌ ప్రారంభ ధర రూ. 1,49,999(Ex-Showroom)గా ఉంది. ఎకోడ్రైఫ్ట్‌ బైక్ ఒక సారి ఫుల్ ఛార్జీ చేస్తే 151 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక ఈట్రిస్ట్ ఎక్స్‌ బైక్ ఒక ఫుల్ ఫుల్ ఛార్జీతో 171 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది.

Advertisement

Next Story