Maharastra Assembly 2024 ఎలక్షన్ షురూ.. ఓటేసిన అజిత్ పవార్, సచిన్

by karthikeya |   ( Updated:2024-11-20 04:09:22.0  )
Maharastra Assembly 2024 ఎలక్షన్ షురూ.. ఓటేసిన అజిత్ పవార్, సచిన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు ఆ తర్వాత ఓటింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఆయన ఫ్యామిలీతో కలిసి ముంబైలో తన ఓటు వేశారు. అలాగే నాగ్‌పూర్‌లో RSS చీఫ్ మోహన్ భగవత్, బారామతి అసెంబ్లీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ బారామతిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎన్‌సీపీ శరద్ పవార్ పార్టీ నేత సుప్రియా సూలే కూడా తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా.. ముఖ్యంగా మహాయుతి కూటమిలో భాగంగా ఉన్న మూడు పార్టీల్లో బీజేపీ 149 స్థానాల్లో.. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(MVA) కాంగ్రెస్,ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 101, శివసనేన యూబీటీ 95, శరద్ పావర్ పార్టీ 86 చోట్ల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed