- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashanth Verma: చాన్స్ వస్తే డైరెక్షన్ మానేసి ఆ పని చేసుకుంటా.. ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు పాన్ ఇండియా హిట్ కొట్టి భారీ కలెక్షన్లు సాధించింది. అలాగే ప్రశాంత్ వర్మకు ఫుల్ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రశాంత్ యూనివర్స్‌లో ఓ 5 సినిమాలు రాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇందులో కొన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా మరి కొన్ని అతని పర్యవేక్షణలో వేరేవాళ్లు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event)కు గెస్ట్‌గా వెళ్లిన ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాలు మొదలుపెట్టే కంటే ముందే 33 కథలు రాసుకున్నాను. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఆ 33 కథల్లో లేవు. అవి కొత్తగా రాసుకొని తెరకెక్కించాను. నాకు కథలు రాయడం అంటే ఇష్టం. ఏ డైరెక్టర్స్ అయినా చాన్స్ ఇస్తే హ్యాపీగా డైరెక్షన్ ఆపేసి కథలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏ డైరెక్టర్ అడిగినా కథలు ఇస్తా.. బోయపాటి(Boyapati Srinu) అడిగినా కూడా కాదనను’’ అని చెప్పుకొచ్చాడు.