Youtube Video: పికాక్ కర్రీ ఎలా చేయాలో తెలుసా..? వీడియోపై జంతు ప్రేమికుల ఆగ్రహం

by Ramesh Goud |
Youtube Video: పికాక్ కర్రీ ఎలా చేయాలో తెలుసా..? వీడియోపై జంతు ప్రేమికుల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ పక్షి అయిన నెమలిని చంపడం చట్టరిత్యానేరం అంతేకాదు అనుమతి లేకుండా పెంచుకోవడం కూడా శిక్షార్హులే అవుతారు. అలాంటిది ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ ఓ ఘనుడు ఏకంగా యూట్యూబ్ లో పెట్టేశాడు. ఈ వీడియోపై జంతుహక్కుల కార్యకర్తలు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లలోని తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ సాంప్రదాయ వంటకాలను చేసి దానికి సంబందించిన వీడియోలను ఎస్ఆర్ఐ టీవి అనే యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శనివారం సాంప్రదాయ పద్దతిలో నెమలి కూర ఎలా చేయాలో చూడండి అంటూ ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో యూట్యూబ్ తొలగించింది.

అప్పటికే ఈ వీడియోను ఒక వెయ్యి నాలుగు వందల మందికి పైగా చూసినట్లు తెలుస్తోంది. అతని చానెల్ లోకి వెళ్లి చూస్తే.. అప్పటికే అడవి పంది కూర ఎలా వండాలో కూడా చేసి చూపించాడు. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను చంపడం చట్ట విరుద్దమైన చర్య అని, భారత జాతీయ పక్షి నెమలిని చంపకూడదని కూడా తెలియదా.. అని మండిపడుతున్నారు. ఈ వీడియో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. విలేజ్ ఫుడ్ చానెల్ వాళ్లు కూడా ఇలాంటి వీడియోలే యూట్యూబ్ లో పెడుతుంటాడని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story