దారుణం.. అన్నను వెంబడించి మరి హత్య చేసిన తమ్ముడు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-08 06:19:53.0  )
దారుణం.. అన్నను వెంబడించి మరి హత్య చేసిన తమ్ముడు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో దారుణ హత్య జరిగింది. తల్లి దగ్గర ఉన్న డబ్బుల విషయంలో పాత బస్టాండ్‌కు చెందిన అన్న సాదిక్, తమ్ముడు అంజద్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అంజద్ రాళ్లతో దాడి చేస్తూ వెంబడించి అన్న సాదిక్‌ను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌కు చెందిన సాదిక్, అంజద్‌లు అన్నదమ్ములు. తల్లి దగ్గర ఉన్న డబ్బుల విషయంలో అన్నదమ్ములు సాదిక్, అంజాద్ గొడవపడ్డారు. బుధవారం రాత్రి అన్న సాదిక్, తమ్ముడు అంజాద్ పాత బస్టాండ్ సమీపంలోని వైన్స్ లోని పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించారు. మద్యం సేవించిన సమయంలో తల్లికి సంబంధించిన డబ్బుల విషయంలో అన్నదమ్ములు గొడవపడ్డారు.

ఈ క్రమంలో అన్న సాదిక్‌పై తమ్ముడు అంజాద్ దాడి చేశాడు. దీంతో సాదిక్ పారిపోతుండగా తమ్ముడు అంజాద్ రాళ్లతో దాడి చేస్తూ వెంబడించాడు. పాత బస్టాండ్‌లో అన్న సాధిక్‌ను తమ్ముడు అంజాద్ బండరాయితో మోదీ అతి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో సాధిక్‌ను హత్య చేసిన తమ్ముడు అంజాద్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed