- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KA Paul : ఆదానీ, అంబానీలను బిలియనీయర్లుగా చేసిందే మీరు : కాంగ్రెస్ పై కేఏ పాల్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : అదానీ, అంబానీ(Adani and Ambani)లను బిలియనీర్లుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల(Congress Govt)ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul)విమర్శించారు. ఇప్పుడు అదానీని అరెస్టు చేయలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం వారి దంద్వ విధానాలను వెల్లడిస్తుందన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరిపించాలని ఎన్నికల్లో ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడిచిన ఎందుకు మెఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేయలేదని, ఇప్పుడు రేవంత్ కు ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడని పాల్ ప్రశ్నించారు. ఈరకమైన దంద్వ విధానాలు వద్ధని పాల్ హితవు పలికారు.
కాళేశ్వరం అవినీతిపై కాగ్ రిపోర్టు తేటతెల్లం చేసిందని దమ్ముంటే కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే సత్వర న్యాయం జరుగుతుందని, కోర్టుల విచారణతో ఏండ్లు పడుతుందన్నారు. నేను విశాఖ స్టీల్ ఫ్లాంటు ప్రవైటును కోర్టు ద్వారా ఆపానని, అవినీతి; ఫిరాయింపు ఎమ్మెల్యేలను డిస్మిస్ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రజలు నా పోరాటానికి మద్దతుగా కదులాలని కోరారు.