- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సైబర్ నేరాలను మీరే ఎదుర్కొవచ్చు.. తెలంగాణ పోలీస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరాలను (Cyber Crimes) మీరే ఎదుర్కోవచ్చు అని తెలంగాణ పోలీస్ (Telangana Police) ఆసక్తికర ట్వీట్ (Intresting Tweet) చేసింది. ఇటీవల కాలంలో సైబర్ నేరాగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ (Technology)ని ఉపయోగించుకొని కొత్త కొత్త స్కాములకు (Scams) పాల్పడి అమాయక ప్రజలను సైబర్ నేరాల భారీన పడేస్తున్నారు. కృత్రిమ మేధ (Artificial Intelligence) సాహయంతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి, అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు (Police) అవగాహన కల్పిస్తున్నా కూడా అమాయకులే కాక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (Software Employees) సైతం మోసపోతూనే ఉన్నారు.
వీటిపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా (Social Media)లో ఎల్లప్పుడు యాక్టివ్ (Active) గా ఉంటూ ప్రత్యేక ట్వీట్లు (Special Tweets) చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సైబర్ నేరాలపై సలహాలు ఇస్తూ.. స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సైబర్ నేరాలను మీరే ఎదుర్కోవచ్చని, సైబర్ నేరానికి గురవ్వకుండా కాపాడుకోవడం చాలా సులభం అని చెప్పుకొచ్చారు. అలాగే సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహాన పెంచుకోవాలని, మీ సన్నిహితులకు అవగాహన కల్పించాలని, ఈజీ మనీ కోసం ఆశ పడవద్దని, ఎవరైనా బెదిరిస్తే భయపడవద్దని పలు సూచనలు చేసింది. ఇక దీనిపై సైబర్ నేరాలను ఎదుర్కోవడం చాలా సులభమని, సరైన అవగాహన ఉంటే సైబర్ నేరాల బారిన పడే అవకాశం అస్సలు ఉండదని, కాబట్టి మీ సన్నిహితులకు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అప్రమత్తం చేయాలని, వారికి కూడా అవగాహన కల్పించండి అని రాసుకొచ్చింది.