సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యేవాడా?: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-04-23 16:04:41.0  )
సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యేవాడా?: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ; తెలంగాణ బ్యూరో: సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్‌కు సీఎం అయ్యే అదృష్టం వచ్చిందన్నారు. ఇప్పుడు తెలివిగా కాంగ్రెస్ ఏం చేసిందని విచిత్రంగా మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంతో కేసీఆర్ మైండ్ సరిగ్గా పని చేయడం లేదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ఆగమయ్యే వాడని విమర్శించారు. పదేళ్లు పవర్‌లో ఓ ఉండి అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశాడని ఆరోపించారు.

రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ ఇద్దరూ ఒకే విధానాన్ని అవలభించారని తెలిపారు. ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే, మోడీ వాటిని అమ్ముకుంటున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో నిబద్ధత కలిగిన రాజకీయ నేత వాజ్‌పాయ్ కూడా నిండు పార్లమెంట్‌లో ఇందిరమ్మను అపర కాళీ అని కొనియాడారని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ కాంగ్రెస్‌ను విమర్శించడం దారుణమని అన్నారు. పుల్వామా‌లో మన జవాన్లను చంపితే మోడీ నిద్రలో ఉన్నాడని అన్నారు. మోడీ, అమిత్ షాలకు ఇందిరమ్మ చరిత్ర తెలియదని ఫైర్ అయ్యారు. దళితులకు, గిరిజనులకు భూములు పంచిన చరిత్ర ఇందిరమ్మదేనని అన్నారు.

ఇప్పటికే ఇందిరమ్మ ఇచ్చిన భూముల పైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. మోడీ, కేసీఆర్ కనీసం ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, హెచ్ ఏఎల్, హెచ్ ఎంటీ, బీడీఎల్, హెచ్ సీఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ లాంటి సంస్థలను కాంగ్రెస్ తీసుకువచ్చిందపి గుర్తు చేశారు. ఇది ఇప్పుడున్న యువత తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.


Read More...


KCR: ఎన్నికల కదనరంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి బస్సు యాత్ర ప్రారంభం

Advertisement

Next Story