- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై మహిళ వినూత్న పోరాటం.. రోడ్డుపై ఉన్న నీటి గుంతలో దిగి నిరసన.. ఎందుకంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు దుస్థితి బాగాలేదని నడి రోడ్డుపై ఓ మహిళ వినూత్నంగా ఒంటరి పోరాటం చేస్తుంది. హైదరాబాద్ - నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయిన ఎవరు పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డు మీద ఉన్న నీటి కుంటలో దిగి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చేపట్టిన వినూత్న నిరసనకు నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలేనని, లీడర్స్ కోసం కొట్టుకోవడం కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
అయితే లాస్ట్ ఐదేళ్ల నుంచి నాగోల్‌లోని ఆనంద్ నగర్ రోడ్లన్నీ గుంతల మయంగా ఉన్నాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. పౌరుల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అని నెటిజన్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, నగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే రోడ్లన్ని దుమ్ము, గుంతల మయంగా మారుతున్నాయి. దీంతో రోడ్లపై రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం తొందరగా స్పందించడం లేదు.