- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటిపై తాత మధు సంచలన ఆరోపణలు..
దిశ బ్యూరో, ఖమ్మం: బీఆర్ఎస్‌లో ఏడు సంవత్సరాలు ఉండి, కలలన్నీ నెరవేర్చుకుని ఇప్పడు పార్టీకి ద్రోహం చేస్తావా? నోటికి వచ్చినట్లు అవాకులు, చెవాకులు మాట్లాడుతావా? అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫైర్ అయ్యారు.
గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఈ క్రమంలోనే చేరికలు జరిగి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరారని చెప్పారు. 7 సంవత్సరాలు పార్టీలో ఉండి, తన కలలు నెరవేర్చుకుని రూ.300 కోట్ల నుంచి రూ.3వేల కోట్లు సంపాదించాడని మండిపడ్డారు.
వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తూ..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, బుధవారం వైరాలో జరిగిన కార్యక్రమంలో అన్ని అబద్ధాలే మాట్లాడారని మధు దుయ్యబట్టారు. పార్టీలో ఉన్న నాయకులందరూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామజపమే చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారని, ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరి జపం చేశారని ఆగ్రహించారు.
నాడు పొగిడిన నోటితోనే నేడు ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ పరిపక్వతకు అద్ధం పడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల గురించి గొప్పగా చెప్పకుండా మోదీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతామా? అంటూ ఎదురు ప్రశ్నించారు.
108 ఎకరాలు ధరణిలో ఎంటర్ కాలేదా?
ధరణి తప్పుల కుప్పగా మారిందని పొంగులేటి అంటున్నాడని ఆయనకు చెందిన 108 ఎకరాల భూములు ధరణిలో ఎంటర్ కాలేదా? అని తాత మధు ప్రశ్నించారు. పాస్ బుక్కులు పొందలేదా? అని ప్రశ్నించారు. కొత్త సాఫ్ట్ వేర్ కారణంగా చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమని, అవికూడా లేకుండా చేస్తున్నామని స్పష్టం చేశారు.
సీతారామకు ఎందుకు టెండర్ వేశావు..
ఇంకా సీతారామ ప్రాజెక్టు 15 ఏండ్లు అయినా పూర్తి కాదన్న పొంగులేటి మాటలకు తాత కౌంటర్ ఇచ్చారు. 15 ఏండ్లకు కూడా పూర్తి కాని ప్రాజెక్టుకు నీవెందుకు టెండర్ వేశావని, టెండర్ వేసిన ఆధారాలు మొత్తం తన దగ్గర ఉన్నాయని విలేకరుల సమావేశంలో పత్రాలను చూపించారు.
ఆర్థికంగా లబ్ధి పొందేందుకు మాత్రం టెండర్ వేస్తావా? తర్వాత ప్రాజెక్టు పూర్తవుతుందో లేదోనంటూ ప్రజలకు కల్లబోల్లి కబుర్లు చెబుతావా? అంటూ విమర్శించారు. నువు విమర్శించే ప్రతీ మాటకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉన్నదని స్పష్టం చేశారు. పొంగులేటి ఏం చదువుకున్నాడో తనకైతే తెలియది కానీ.. మానసిక పరిస్థితి మాత్రం బాగోలేదని అర్థం అవుతుందని అన్నారు.
ప్రజా కోర్టులో తనకు శిక్ష పడటం ఖాయమని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. పొంగులేటి ఏర్పాటు చేసుకునే సన్నాహక సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, పార్టీలో ఉండి లబ్ధి పొంది, ఇప్పడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని తాత మధు హితవు పలికారు.
ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మేయర్ పూనుకొల్లు నీరజ, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కమర్తపు మురళి తదితరులున్నారు.
- Tags
- thatha madhu
- BRS