TGPSC: ఉద్యోగార్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటా: బండి సంజయ్

by Ramesh N |
TGPSC: ఉద్యోగార్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటా: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగార్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఈవో ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం గురించి ఉద్యోగార్థులు తనను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. 2022 లో విడుదలైన నోటిఫికేషన్ కి ఇప్పటికీ నియామకాలు చేపట్టకపోవడం దారుణమన్నారు.

కోర్టు ఆదేశాలను సైతం టీజీపీఎస్‌సీ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మహిళా అభ్యర్థులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం,టీజీపీఎస్సీ వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగార్ధులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటాం అని, వాళ్ల తరఫున కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళా అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story