- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Employees: కేసీఆర్ ఉచ్చులో చిక్కిన ఉద్యోగులు?
ఎంప్లాయీస్ టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. పీఆర్సీ విషయంలో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడూ అమలు చేసే చాన్స్ ఉన్నది. గత పీఆర్సీ కాలపరిమితి 2023తో ముగుస్తున్నది. దీంతో ఎన్నికల ముందే పీఆర్సీ ప్రకటించి ఎంప్లాయీస్ ఓట్లను మళ్లించుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ముందుచూపుతో 2018లో పీఆర్సీని ప్రకటించారు. అసెంబ్లీని సెప్టెంబరు 6న ముందస్తుగా రద్దు చేశారు. దీనికి ముందుగానే మే 18న ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసింది. తొలుత మూడు నెలల వ్యవధిలోనే రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి సూచించింది. సీఆర్ బిస్వాల్, సీ ఉమామహేశ్వరరావు డాక్టర్ మహ్మద్ అలీ రఫత్‌లతో కూడిన పీఆర్సీ కమిటీ చివరకు డిసెంబరు 2020న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. ఈసారి కూడా కొత్త పీఆర్సీని సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించే అవకాశమున్నది. చాలాకాలంగా ఉద్యోగులు కూడా కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సకాలంలోనే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందనే ఆశల్లో ఉన్నారు.
సర్కారుపై అసంతృప్తి..
రాష్ట్రంలో 2018లో రాజకీయపరంగా ఏ కూటమి, పార్టీ పోటీ కాదనే ధీమా టీఆర్ఎస్‌లో వ్యక్తమైంది. కానీ ఈసారి మాత్రం బీజేపీతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. ధనిక రాష్ట్రంలో జీతాలు కూడా టైమ్‌కు రావడంలేదనే ఉద్యోగుల్లోని అసంతృప్తి ఎన్నికల సమయంలో ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకొస్తుందోననే భయం బీఆర్ఎస్ నేతల్లో ఉన్నది. దీనికి తోడు 317 జీవోతో సమస్యలు, స్పౌజ్ వ్యవహారంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబించడం, వీఆర్వో వ్యవస్థ రద్దు, వీఆర్ఏల భవిష్యత్తు ప్రమాదంలో పడడం, పంచాయతీ కార్యదర్శుల్లోని ఆగ్రహం, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగులను పీకేయడం.. ఇలాంటి భయాలు బీఆర్ఎస్‌ను వెంటాడుతున్నాయి. ఇక ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం సరేసరి. వీటన్నింటి నేపథ్యంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకోడానికి పీఆర్సీని బీఆర్ఎస్ ఒక అస్త్రంగా వాడుకోవాలనుకుంటున్నది.
ఉద్యోగులను సంతృప్తిపర్చేందుకు..
మునుపటికంటే ఈసారి ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో పీఆర్సీ ద్వారా ఉద్యోగ వర్గాలను సంతృప్తిపర్చవచ్చనే భావన నెలకొన్నది. రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పింఛనుదార్లుగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కలిపి దాదాపు పది లక్షల వరకూ ఉన్నారు. గత రెండేండ్లుగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతి నెలా టైమ్‌కు జీతాలు రావడంలేదనే అసంతృప్తి ఉన్నది. సకాలంలో డీఏ (కరువుభత్యం) కూడా ఇవ్వడంలేదనే ఆవేదనా ఉన్నది. గత పీఆర్సీ కేవలం 7.5% మాత్రమే ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీ వేదికగా 2021 మార్చి 22న 30% ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఒక సంప్రదాయం ప్రకారం సీఎం ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. పూలబొకేలతో ఆయనకు సన్మానం చేశారు.
బడ్జెట్ తర్వాత..
ప్రస్తుతం రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు జరుగుతూ ఉన్నందున మార్చి నెలలో అది క్లోజ్ కాగానే, పీఆర్సీపైనే సర్కారు దృష్టి సారించే అవకాశమున్నది. ఇప్పటికే పలు కొత్త ఉద్యోగాలకు (ఖాళీల భర్తీ) వివిధ డిపార్టుమెంట్లకు చెందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలతో పాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం నోటిఫికేషన్లను జారీచేసింది. వాటి పరీక్షలు, ఫలితాలు, కొన్ని జాబ్స్ కు నియామక ప్రక్రియ మొదలైంది. పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకూ కసరత్తు జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఎన్నికల నాటికి ఒక కొలిక్కి వస్తే వాటిని ప్రజల్లో భారీ స్థాయిలో ప్రస్తావించి యువతను ఆకట్టుకోవాలనుకుంటున్నది. మరోవైపు పీఆర్సీ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను వర్గాలను సైతం దగ్గర చేసుకోవాలనుకుంటున్నది. మార్చి తర్వాత సరైన సమయాన్ని, రాజకీయ పరిస్థితులను, రాష్ట్రంలోని అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నది.