- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC Kalvakuntla Kavitha : రైతాంగంపై మీకెందుకంత అక్కసు..? రాహుల్ గాంధీపై ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు.
రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్‌కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు."రాహుల్ గాంధీ జీ.... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నారా ?" అని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.
Read more :