పదేళ్ల పాలనను పదే పదే ఎందుకు గుర్తు చేస్తావ్ కేటీఆర్!.. తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2024-07-15 07:29:06.0  )
పదేళ్ల పాలనను పదే పదే ఎందుకు గుర్తు చేస్తావ్ కేటీఆర్!.. తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మీ తండ్రి ప్రతి పథకంలో ఫ్రీ అని చెప్పి అరచేతిలో బెల్లం పెట్టి, మోచేయి నాకించాడని, ఆ పదేళ్ల పాలనను ఎందుకు పదే పదే గుర్తు చేస్తావ్ కేటీఆర్ అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటకలో మాదిరిగా ఆర్టీసీ చార్జీలు పెంచే రోజు ఎంతో దూరంలో లేదని, ఉచితం అని చెప్పబడిన దేనికైనా ఎల్లప్పుడూ భారీ ధర ఉంటుందని అని కేటీఆర్ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మీ తండ్రి దళితులకు మూడెకరాల భూమి ఫ్రీ అని, బీసీ బంధు కూడా ఇస్తా అన్నాడని గుర్తు చేశింది. అలాగే రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీ అన్నాడని, దళితులకు బంధు ఫ్రీ, పేదలకు డబుల్ బెడ్ రూంలు ఫ్రీ అని చెప్పి ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి.. మోచెయ్యి నాకించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ పదేళ్ల పాలనను పదే పదే ఎందుకు గుర్తు చేస్తావ్ కేటీఆర్!! అని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేటీఆర్.. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల 295 కోట్ల నష్టం రావడంతో ఆర్టీసీ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు ఓ ప్రముఖ డిజిటల్ మీడియా పెట్టిన పోస్ట్ పై స్పందిస్తూ.. ఎవరైనా "ఇది ఉచితం" అని చెప్పినప్పుడు, వారు మిమ్మల్ని రైడ్ కోసం తీసుకెళ్తున్నారని గుర్తుంచుకోవాలని అన్నారు. అలాగే "ఉచితం" అని మీకు చెప్పబడిన దేనికైనా ఎల్లప్పుడూ భారీ ధర ఉంటుందని తెలిపారు. ఇక తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడిచి బస్సు చార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదు అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

Advertisement

Next Story