‘ఎందుకు పిల్లల ఉసురు పోసుకుంటున్నారు?’

by Sathputhe Rajesh |
‘ఎందుకు పిల్లల ఉసురు పోసుకుంటున్నారు?’
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల మెయిన్ ఫీచర్‌గా మారిపోయిందని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అనురాధరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై స్పందించిన ఆయన.. పిల్లల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారని నిలదీశారు.

మన విద్యాశాఖ, కాలేజీ యాజమాన్యం సాత్విక్ ప్రాణాలను తిరిగి తేగలదా అని ప్రశ్నించారు. తమ బాధను చెప్పుకునే అవకాశం పిల్లలకు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ కాలేజీ యాజమాన్యంతో పాటు నిబంధనలు సరిగా చూడని విద్యాశాఖ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల ఊబిలోకి విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లిపోతున్నారని ఈ విషయంలో తల్లిదండ్రులలోనూ మార్పు రావాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed