ఈ పాపం ఎవరిది? పాము కాటుతో చిన్నారి మృతి ఘటనపై ఆర్ఎస్పీ సీరియస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-13 14:11:29.0  )
ఈ పాపం ఎవరిది? పాము కాటుతో చిన్నారి మృతి ఘటనపై ఆర్ఎస్పీ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా భట్టు తండా స్కూల్‌లో పాము కాటుతో ఆరేళ్ల చిన్నారి మరణించిన ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా గురువారం స్పందించారు. మన ఊరు మన బడి పథకం పేరుతో కోట్ల రూపాయలు మెఘా అర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని పాఠశాలలు బాగు చేస్తే స్కూల్‌లో పాములు సంచరించడం ఏంటని నిలదీశారు. చిన్నారి మరణం పాపం ఎవరిదని నిలదీశారు. మన ఊరు మన బడి పథకం కోసం కేటాయించిన వందల కోట్లు ఏ పందికొక్కులు బుక్కాయని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను నిర్వీర్యం చేయడమేనా మీ లక్ష్యం అంటూ ప్రశ్నించారు. పరిపాలనలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి : అలా చేస్తుండగా నా ప్యాంటులో ఎలుక దూరింది: Amita Bachchan

Advertisement

Next Story