టాలీవుడ్ ప్రముఖ నటికి మాతృ వియోగం.. మిస్ యు అమ్మా అంటూ ఎమోషనల్ పోస్ట్

by Kavitha |
టాలీవుడ్ ప్రముఖ నటికి మాతృ వియోగం.. మిస్ యు అమ్మా అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలో నటించి మెప్పించిన రజిత(Rajitha) మనందరికీ సుపరిచితమే. చాలా చిత్రాల్లో అమ్మగా, అత్తయ్యగా, వదినగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అయితే తాజాగా నటి రజిత తల్లి మరణించారు. ఆమె తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi) 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. మార్చి 21 శుక్రవారం మధ్యాహ్నం ఆవిడ కన్నుమూశారు. అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిలింనగర్ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారని సమాచారం. ఇక ఆమె తల్లి మరణించడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

కాగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు. ఇక తల్లి మరణించడంతో రజిత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ ‘మిస్ యు అమ్మ’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు ఓం శాంతి, మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed