- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Madhavilatha : సమంతపై వ్యాఖ్యలకు ఎవరి తలలు పగలగొట్టారు : మాధవీలత
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరి ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ (Congress)శ్రేణులు బీజేపీ కార్యాలయంపై దాడి(Attack on BJP office) చేయడం పట్ల బీజేపీ నాయకురాలు మాధవీలత(Madhavilatha) మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై దాడికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యాలయంపై దాడి చేసి, అమాయకులైన బీజేవైఎం కార్యకర్తల తలలు పగులగొట్టారని, మరి నటి సమంతపై మీ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యల(Comments on Samantha)పై ఎవరి తలలు పగలగొట్టారని మాధవీలత ప్రశ్నించారు. ఓ నాయకుడి మాటలు మీకు ఇబ్బంది కల్గితే ప్రజాస్వా్మ్య యుతంగా నిరసన తెలపవచ్చని, మీడియా ద్వారా ఖండించవచ్చన్నారు. అంతేగాని ఈ రకంగా అధికార పార్టీ అన్న అహంభావంతో దాడులకు తెగబడటం..అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తు ఉండిపోవడం ఎంతవరకు సమంజమని మాధవీలత నిలదీశారు.
సమంత పై మీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మీ నాయకుల తలలు ఎందుకు పగలగొట్టలేదని, అప్పుడు మీకు అవి వినిపించలేదా అని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని మాధవీలత డిమాండ్ చేశారు.