- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజిగిరిలో గెలుపెవరిది..? తాజా సర్వేలో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికలు అనగానే ప్రధానంగా చర్చకు వచ్చే మల్కాజిగిరి సెగ్మెంట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. మినీ ఇండియాగా పేరొందిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది కావడంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉన్నది. ఈ స్థానం నుంచి ఎంపీగా గెలిచి సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడం.. బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలవడంతో ఇది హాట్ సీటుగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిది అనేదానిపై రకరకాల అంచనాలు, సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్లు తేల్చింది. ఇక్కడ బీజేపీ 46.79 శాతం ఓటు షేర్ దక్కించుకోబోతున్నదని కాంగ్రెస్ పార్టీ 26.76 శాతం, బీఆర్ఎస్ 19.98 శాతం, ఇతరులు 6.48 శాతం ఓటు షేర్ దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చేపట్టిన ట్రాకింగ్ పోల్‌లో వెల్లడైంది.
7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కమలం ఆధిపత్యం!
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 1,729 శాంపిల్స్ సేకరించామని, పోటీలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకున్నట్లు 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో ఈటల రాజేందర్‌కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈటలకు 61.1 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డికి 24.6 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 13.1 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. ఇక నోటా, ఎటువంటి స్పందన తెలుపని వారు 1.2 శాతం మంది ఉన్నట్లు తేలింది. అభివృద్ధి అంశాన్ని ఆధారంగా ఓటు వేస్తామని 42 శాతం, పార్టీని చూసి ఓటు వేస్తామని 34 శాతం, ప్రధాని అభ్యర్థిని చూసి 20.9 శాతం, ఇతర కారణాలతో 1.9 శాతం మంది తమ ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. ఇక 63 శాతం మంది పురుష ఓటర్లు, 54 శాతం మంది మహిళా ఓటర్లు ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.
బీసీలు ఎవరి వైపు..?
కులాల వారీగా అభ్యర్థులకు పోలయ్యే ఓటు శాతం పరిశీలిస్తే మెజార్టీ బీసీ ఓటర్లు ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు 26 స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. 65 శాతం బీసీలు, 59 శాతం ఓసీ, 36 శాతం ఎస్సీ, 44 శాతం ఎస్టీ ఓటర్లతో పాటు ఇతరుల్లోని 71 శాతం మంది ఓటర్లు ఈటల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. 72 మంది శాతం కార్మికులు, 67 శాతం రైతులు, 64 శాతం ఉద్యోగులు, 85 శాతం మంది వ్యాపారవేత్తలు, 52 శాతం మంది గృహిణులు, 58 శాతం మంది డ్రైవర్లు, 32 శాతం విద్యార్థులు ఈటల వైపు నిలబడబోతున్నట్లు లెక్కకట్టారు.
కాంగ్రెస్‌కు షాక్..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి టికెట్ సాధించుకున్న పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగలబోతున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. స్వయంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి బరిలో నిలిచిన ఆమె.. రెండో స్థానానికే పరిమితం కాబోతున్నారని ఈ సర్వే తేల్చింది.
మాజీ మంత్రి సెగ్మెంట్‌లోనూ బీజేపీదే హవా:
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు వచ్చే సరికి పరిస్థితులు తారుమారు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఏడింటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వెనుకబడిపోయినట్లు, ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ స్థానంలోనూ గులాబీ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పరిమితం కాబోతున్నదని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.
కూకట్‌పల్లి
పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్
బీజేపీ 42.39%, 56.9%
కాంగ్రెస్ 30.19%, 25.7%
బీఆర్ఎస్ 20.15%, 17.4%
ఇతరులు : 7.27%
ఎల్బీనగర్
పీపుల్స్ పల్స్,26 స్ట్రాటజీస్
బీజేపీ 50.88%, 44.9%
కాంగ్రెస్ 25.26%, 30.8%
బీఆర్ఎస్ 17.77%, 23.1%
ఇతరులు 6.08%
మల్కాజిగిరి
పీపుల్స్ పల్స్ , 26 స్ట్రాటజీస్
బీజేపీ 49.89%, 65.2%
కాంగ్రెస్ 25.35%, 26.7 %
బీఆర్ఎస్ 18.40%, 5.3%
ఇతరులు 6.27%
మేడ్చల్
పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్
బీజేపీ 48.28%, 70.1%
కాంగ్రెస్ 25.90%, 18.5%
బీఆర్ఎస్ 19.84%, 9.9%
ఇతరులు 5.98%
కుత్బుల్లాపూర్
పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్
బీజేపీ 42.01%, 62%
కాంగ్రెస్ 29.42%, 20.1%
బీఆర్ఎస్ 21.43%, 17.3%
ఇతరులు 7.13%
కంటోన్మెంట్
పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్
బీజేపీ 51.64%, 61.9%
కాంగ్రెస్ 22.41%, 23.8%
బీఆర్ఎస్ 19.49%, 14.3%
ఇతరులు 6.46%
ఉప్పల్
పీపుల్స్ పల్స్, 26 స్ట్రాటజీస్
బీజేపీ 48.33%, 47.7%
కాంగ్రెస్ 25.14%, 33%
బీఆర్ఎస్ 20.82%, 19.3%
ఇతరులు 5.71%