- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు ? నియామకంపై సీఎం క్రేజీ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్‌గా ఓ సీనియర్ ఐఏఎస్‌ను అపాయింట్ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా ఆ పోస్టుకు సరైన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే బాగుంటుదనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే, రిటైర్డ్ ఐఏఎస్‌కు అవకాశం ఇస్తారా? లేకపోతే సర్వీసులో ఉన్న ఆఫీసర్‌తో వీఆర్ఎస్ ఇప్పించి, ఆ పోస్టులో కూర్చొపెడుతారా? అనే చర్చ జరుగుతున్నది. వచ్చే నెల 3న ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీనితో కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.
పూర్తికాలం చైర్మన్‌పై సీఎం ఫోకస్
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పూర్తి కాలం చైర్మన్‌ను నియమించేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆరేళ్ల పాటు లేదా 62 ఏళ్ల వయసు నిండేలోపు పదవిలో ఉంటారు. అయితే రెండు, మూడేళ్లకు ఓ చైర్మన్‌ను అపాయింట్ చేయడం వల్ల సంస్థ కార్యకలాపాలను ఆర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. దీనితో నియామక ప్రక్రియపై ప్రభావం పడుతుందని అభిప్రాయంలో సీఎం ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకని ఈసారి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించేందుకు ఫోకస్ పెట్టినట్టు టాక్ ఉంది. అందులో భాగంగా ఆయన తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్ ఆఫీసర్ల జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే చైర్మన్ ఎంపిక విషయంలో సీఎం రేవంత్ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక కోణానికి ప్రయారిటీ ఇస్తారని సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు.
రేసులో రిటైర్డ్ అధికారులు, ప్రొఫెసర్లు
టీజీపీఎస్సీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పలువురు రిటైర్ట్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్య రిటైర్డ్ అయిన పలువురు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అలాగే పనిలో పనిగా కొందరు ఐఏసీసీ లీడర్ల నుంచి సిఫారసు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు పలు వర్సిటీల్లో పనిచేస్తోన్న ప్రొఫెసర్లు సైతం చైర్మన్ పోస్టుపై ఆశలుపెట్టుకుని లాబీయింగ్‌కు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.