- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana BRS బాస్ ఎవరు?
దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను తోట చంద్రశేఖర్‌కు అధిష్టానం అప్పగించింది. దీంతో తెలంగాణ స్టేట్ బాస్ ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. ఎలక్షన్ టైమ్‌లో ఈ బాధ్యతలు కీలకం కానుండగా, కొడుకు కేటీఆర్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే పార్టీలో పట్టున్న లీడర్, నమ్మకమైన నాయకుడికి పగ్గాలు అప్పజెప్పాల్సి ఉంటుంది. అందుకని సీఎం కేసీఆర్ మదిలో ఎవరున్నారనే చర్చ పార్టీలో జరుగుతున్నది.
కేటీఆర్‌కే చాన్స్!
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టిన తర్వాత రాష్ట్ర పార్టీ పదవిని కేటీఆర్ ఇస్తారనే చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కొంత కాలం పాటు కేసీఆర్ సీఎంగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ పూర్తిగా వెళ్తారని, అప్పుడే కేటీఆర్‌కు పట్టాభిషేకం ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారని టాక్. ఒకవేళ ఇతర లీడర్లకు ఆ పదవి ఇస్తే భవిష్యత్తులో రాజకీయ సమస్యలు వస్తాయనే ఆందోళన కేసీఆర్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
Also Read..