- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
KTR చుట్టూ ‘ఈ-రేసింగ్’ ఉచ్చు! భయంతో మలేషియాకు ఎస్కేప్?
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఫార్ములా ఈ-రేసింగ్’లో నిధుల గోల్మాల్ విషయంలో ఏసీబీ ఎంక్వయిరీ మొదలయ్యే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మలేషియాకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన ఫారిన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అరెస్టులకు భయపడనని చెప్పిన ఆయన.. ఉన్నట్టుండి మలేషియా వెళ్లడం వెనక ఉన్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతున్నది.
ముందస్తు షెడ్యూలా? సడన్ పర్యటననా?
మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకులకు హాజరయ్యేందుకే కేటీఆర్ ఫారిన్ వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అక్కడి నుంచి తిరిగి నేరుగా హైదరాబాద్‌కు వస్తారా? లేదా మరేదైన దేశానికి వెళ్తారా? అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మలేషియా టూర్ సడన్‌గా ఖరారైందా? ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు? ఆయన వెంట ఎవరెవరు వెళ్లారు? అనే కోణంలోనూ సమాచారం చేకరిస్తున్నట్టు తెలిసింది.
రెండు, మూడు రోజుల్లో రంగంలోకి ఏసీబీ!
ఫార్ములా ఈ రేసింగ్‌లో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారంపై రెండు, మూడు రోజుల్లో విచారణ ప్రారంభించేందుకు ఏసీబీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి పలు కీలక పత్రాలను సైతం సేకరించినట్టు తెలుస్తున్నది. అయితే హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణ సంస్థకు వెళ్లిన నిధులు.. అక్కడి నుంచి ఎవరికి వెళ్లాయి? అనే కోణంలోనూ అధికారులు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నట్టు తెలిసింది. ఫార్ములా ఈ–రేసింగ్ మొదటి సీజన్లో పార్టనర్‌గా ఉన్న గ్రీన్కో సంస్థ, రెండో సీజన్ వచ్చేసరికి ఎందుకు ఎంఓయూ రద్దు చేసుకున్నది? అనే కోణంలోనూ సంస్థ నిర్వహకుల నుంచి ఏసీబీ ఆఫీసర్లు సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ప్రమేయం ఏ మేరకు ఉన్నదనే కోణంలోనూ ఇప్పటికే పూర్తి ఆధారాలను సేకరించిందని, కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే నోటీసు ఇచ్చి, విచారించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.
బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా నిధుల విడుదల
సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం రూ.10 లక్షల కన్నా ఎక్కువ నిధులు ఖర్చు చేయాలంటే అందుకు కేబినెట్ ఆమోదం తప్పనిసరని అధికారులు అంటున్నారు. ఒకవేళ అత్యవసర సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు రిలీజ్ చేయాలంటే, అందుకు సరైన కారణాలను నోట్పైల్లో పేర్కొని ఆ తరువాత జరిగే మంత్రివర్గం నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ, మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ నోటి మాటగా ఆదేశాలు ఇవ్వగానే నాటి మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించడం రూల్స్ విరుద్ధమని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో అటు అర్వింద్ ఇటు కేటీఆర్ ఇద్దరూ విచారణ ఎదుర్కోక తప్పదని ఓ సీనియర్ ఐఏఎస్ కామెంట్ చేశారు.
నెల క్రితమే షెడ్యూలు ఖరారు: కేటీఆర్ సన్నిహితులు
మలేషియా టూర్ సడన్‌గా ఫిక్స్ అయింది కాదని, నెల రోజుల క్రితమే ఖరారైందని కేటీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. అక్కడ జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకలకు కేటీఆర్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలిచారని అంటున్నారు. ఫార్ములా ఈ-రేసింగ్ వివాదంలో ఎలాంటి విచారణకైన తాను సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారని వారు గుర్తుచేస్తున్నారు.