కాంగ్రెస్ ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎక్కడ? : హరీష్ రావు

by M.Rajitha |
కాంగ్రెస్ ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎక్కడ? : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటుండగా.. మంత్రులు మాత్రం కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, వారికి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని తేదీలు పొడిగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో.. ఎంత ఇస్తారో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చారని.. వాటిని ఇప్పుడు పట్టించుకోవడమే మానేశారని అన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వారిని నిండా ముంచారని, వారికి కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటుందని, అంతకు మించి కాంగ్రెస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పైగా గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, రాతపరీక్షలు నిర్వహించి అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తే.. నియామక పత్రాలు మాత్రం ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు గర్వపడటం సిగ్గుచేటని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed