- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ పార్టీలో ఉన్న ఓటు మాత్రం బీజేపీకి వెయ్యండి.. మందకృష్ణ వ్యాఖ్యలు.. ప్యాకేజీ ఎంతని తీవ్ర ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ ఏర్పాటు చేసి ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఆ వేదికపైనే ప్రధాని మోడీపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ప్రశంసల వర్షం కురిపించి.. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సభలోనే బీజేపీకి సపోర్ట్ చేయాలని తన వర్గానికి పిలుపునిచ్చారు.
అయితే తాజాగా మందకృష్ణ మాదిగ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీరు ఏ పార్టీలో ఉన్న ఓ మాత్రం బీజేపీ పార్టీకి వేయాలి’ అని మందకృష్ణ మరోసారి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఉన్నవారందరూ రాజీనామా చేసి బీజేపీలో చేరాలని తాను అనడం లేదని, ఏ పార్టీలో ఉన్నవారు అదే పార్టీలో ఉండాలని, కానీ ఓ మాత్రం బీజేపీకి వేయాలని పిలుపునిచ్చారు. బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా.. ఒక్క రోజు కూడా దళితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడని మంద కృష్ణకు ప్రధాని మోడీ ఎంత ప్యాకేజీ ఇచ్చారోనని నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.