'ఉద్యమకారులపై ఉపా కేసులా..?'

by Vinod kumar |
ఉద్యమకారులపై ఉపా కేసులా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమకారులపై 'ఉపా' కేసులు నమోదు చేయడమేమిటనీ? టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్​లో ఆయన మాట్లాడుతూ.. ప్రో హరగోపాల్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ప్రో హరగోపాల్ ఎన్నో సార్లు పోలీసులు, నక్సల్స్​మధ్య శాంతి చర్చలు జరిపినట్టు గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేకతతోనే కేసీఆర్​భయపడ్డాడన్నారు. దీంతో కేసును వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్​ అధికారంలోకి వచ్చాక పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు,మంత్రులు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మేధావులు, విద్యావేత్తలపై, రాజద్రోహం కేసు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచి వేయడం సరికాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed