KTR : న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
KTR : న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ. 500 కోట్ల విలువైన పట్టా భూమిని కబ్జా చేశారని, వంద మంది ప్రైవేటు సైన్యంతో స్థలంలో చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితుడు, మల్కాజ్‌గిరికి చెందిన న్యాయవాది రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. తమ స్థలం గురైందని Rachakonda Police రాచకొండ పోలీస్ కమిషనర్‌‌ను కలిస్తే.. తమనే బెదిరింపులకు గురిచేశారని గత శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సోదరులను కలిసి సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై BRS బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR ఎక్స్ వేదికగా స్పందించారు.

Telangana తెలంగాణ పాలిట దండుపాళ్యం ముఠాలా మారిన సీఎం సోదరులు అంటూ విమర్శించారు. న్యాయవాది భూములకే ఎసరు పెట్టిన CM సీఎం సోదరులు అంటూ పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన ఖాకీలు సీఎం సోదరులతో సెటిల్ చేసుకోమంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేటు సైన్యమా? న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో ఉన్న సోదరులకు తెలంగాణ ఆస్తులను దోచి పెడుతూ.. మరోవైపు అమెరికాలో తమ్ముడి కంపెనీతో రూ. వేయి కోట్ల ఒప్పందంతో ఏం సందేశం ఇస్తున్నట్లు? రాకేష్ రెడ్డి తండ్రి సుదీర్ఘకాలం Congress కాంగ్రెస్‌లో పని చేసినందుకు మీరు ఆ కుటుంబానికి ఇచ్చిన బహుమానం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed