బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు భరోసా ఏది..?

by Disha Web |
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు భరోసా ఏది..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ప్రభుత్వ హాయంలో మహిళలకు రక్షణ లేదని కాంగ్రెస్​ఉమెన్స్​ప్రెసిడెంట్ సునీతరావు పేర్కొన్నారు.గాంధీభవన్​లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతరావు మాట్లాడుతూ..మహిళా సాధికారత ఆవశ్యకతపై అందరికీ అవగాహన ఉండాలన్నారు.సమాజంలో చురుకైన పాత్ర పోషించాలన్నారు.కాంగ్రెస్​ పార్టీ హాయంలోనే మహిళల ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేదని గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ పాలనలో మహిళలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.కుటుంబ పాలనతో పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు.

మహిళలు ఆదిశక్తి, పరాశక్తిగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పుష్పనత ,ఇంచార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ, పీసీసీ జనరల్ సెక్రెటరీ భవాని రెడ్డి కల్వ సుజాత,సదాలక్ష్మి దుర్గారాణి ఆర్ లక్ష్మి కవిత, తైసీన్ సుల్తానా, మాధవి,అనురాధ సౌజన్య రోహిణి వసంత వనిత నాగ శిరోమణి ,భాగ్య,శోభ, విద్య, పావని సంగీత దేవి లక్ష్మి శ్రీ లత అమృత జిలాని ఉమారాణి, రత్న లావణ్య, అచ్చమ్మ అమ్మాజీ అనంతలక్ష్మి, సుగుణ స్వరూప అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed