- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీట్ల పంపకాలు ఏమోగానీ.. ముందు నోట్ల పంపకాల సంగతి తేల్చుకో: వపన్‌పై మంత్రి అంబటి సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎన్నికల్లో పొత్తుతో బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన పార్టీలపై భారీ అంచనాలే ఉన్నాయి. రాష్ట్రం అధికారంలోకి రాబోయేది ఆ రెండు పార్టీలేనని ఇప్పటికే పలు సర్వేల్లో కూడా వెల్లడైంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. సీట్ల సర్దుబాటులో ఇరు పార్టీల అధినేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పొత్తును మరిచి టీడీపీ అభ్యర్థులను ప్రకటించిందంటూ జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదని చంద్రబాబుకు చురకలంటించారు.
అయితే, ప్రస్తుతం టీడీపీ, జనసేనలు ఎన్నికల వరకు కలిసి పని చేస్తాయా.. లేక వడిపోతాయా అన్ని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశాు. X (ట్విట్టర్) వేదికగా మంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సీట్ల పంపకాలు ఇప్పట్లో తేలేవి కాదులే. ఇద్దరూ సీట్ల పంపకాల కన్నా ముందు నోట్ల సంగతి తేల్చుకోవాలి. పవన్‌ను నమ్మిన వారి పరిస్థితి ఏంటనేది మరో పది రోజుల్లో తేలిపోతుంది’ అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
.@ncbn, @PawanKalyan సీట్ల పంపకాలు ఇప్పట్లో తేలేవి కాదు..
— YSR Congress Party (@YSRCParty) February 5, 2024
ఇద్దరూ సీట్ల కంటే ముందు నోట్ల సంగతి తేల్చుకోవాలి
పవన్‌ను నమ్మిన వారి పరిస్థితి ఏంటనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది
-మంత్రి అంబటి రాంబాబు#EndOfTDP#PackageStarPK#PoliticalBrokerPK pic.twitter.com/UdHeJFM3fk