వామ్మో.. కట్ల పామును తిన్న కుక్రి పాము.. ఫొటో వైరల్

by Kavitha |
వామ్మో.. కట్ల పామును తిన్న కుక్రి పాము.. ఫొటో వైరల్
X

దిశ, జడ్చర్ల : సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలు, ఇతర క్రిమి కీటకాలను తిని బతుకుతాయని మనకు తెలుసు. కానీ పాములు తన కంటే చిన్న పామును తినడం సహజమని సర్ప రక్షకుడు, వృక్షశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డా. సదాశివయ్య తెలిపారు. ముఖ్యంగా కట్లపాము పాములనే ఆహారంగా తీసుకుంటుందని పాములు దొరకని పక్షంలో ఎలుకలు ఇతర జీవులను తింటాయని తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనే జడ్చర్లలో జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక ఎరువుల గోదాములో కట్లపాముతో పాటు కుక్రి పాము కనిపించింది. రెండు పాములు ఉన్నాయని వాటిని పట్టుకెళ్లమని సదాశివయ్య‌కు ఫోన్ చేశారు. దీంతో తన శిష్యుడు రాహుల్‌తో అక్కడికి చేరుకున్న సదాశివయ్య కుక్రి పాము కట్ల పామును తినడాన్ని గమనించారు. వాటిని పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేస్తామని తెలిపారు. కాగా ఒక పాము మరొక పామును తినడాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.


Next Story

Most Viewed