పబ్ లో డాక్టర్ పాడు పని.. ఐపీఎస్ అధికారి భార్యతోనే మిస్‌బిహేవ్

by karthikeya |
పబ్ లో డాక్టర్ పాడు పని.. ఐపీఎస్ అధికారి భార్యతోనే మిస్‌బిహేవ్
X

దిశ, శేరిలింగంపల్లి: ఓ ఐపీఎస్ అధికారి ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక సమాచారం మేరకు.. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో ఇటీవల కొత్తగా పబ్ ఓపెన్ చేయగా.. ఈ నెల 20న ఓ ఐపీఎస్ అధికారి తన ఫ్యామిలీతో కలిసి ఆ పబ్‌కు వెళ్లారు. అయితే సదరు పోలీసు అధికారి భార్య వాష్ రూంకు వెళుతున్న సమయంలో మియాపూర్‌కు చెందిన ఓ డాక్టర్ చెయ్యి ఆమెకు తగిలింది. వెంటనే ఆ డాక్టర్ ఆమెకు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. అయితే బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పగా.. ఆయన పబ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆమెకు చెయ్యి తగిలించిన వ్యక్తి మియాపూర్‌కు చెందిన డాక్టర్‌గా గుర్తించి పబ్ యాజమాన్యం.. మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed