Pensions Cut: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక వారందరికీ పింఛన్లు కట్!

by Shiva |
Pensions Cut: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక వారందరికీ పింఛన్లు కట్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు కొత్త పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే, ఎలాంటి అర్హతలు లేని బోగస్ పింఛన్ల (Bogus Pensions)ను ఏరివేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే, ఎలాంటి అర్హతలు లేకపోయినా.. కొందరు అక్రమంగా ప్రభుత్వ సాయాన్ని పొందతున్నారనే విషయం ఇటీవలే ప్రభుత్వం దృష్టి వచ్చింది. దీంతో బోగస్ పింఛన్లను కట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

కాగా, వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలో ఉండగా నేతన్న, దివ్యాంగులు, ఒంటరి మహిళల పింఛన్లలో అనర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వం సాయం నేటికి అందుతోంది. అదేవిధంగా కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి వారి దరఖాస్తులను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకుని ప్రస్తుత లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అవలంభిచనున్నారు. ఇక కొత్త పింఛన్లకు విధివిధానాలు రూపకల్పనపై ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ (Sub Committe) ఏర్పాటు చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed