- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనిల్ కుమార్ యాదవ్ ఓ ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్: మండిపడ్డ సొంత బాబాయ్
దిశ వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Former Minister Anil Kumar Yadav) పై ఆయన సొంత బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ (Deputy Mayor Roopkumar) మండిపడ్డారు. టీడీపీ నేత, మంత్రి నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. అనిల్ కుమార్ ఓ ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి నారాయణ ఎదుర్కొన్నన్ని కేసులు ఎవరూ ఎదుర్కోలేదని.. అక్రమ అరెస్టులు, వేధింపులు అన్నింటినీ ధైర్యంగా తట్టుకొని నిలబడడమే కాకుండా ఎన్నికల్లో ఏకంగా 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి ఆయన తన సత్తా చాటారని, అనిల్ కుమార్ యాదవ్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి పారిపోలేదని రూప్‌కుమార్ ఎద్దేవా చేశారు.
‘‘ప్రతి సంవత్సరం రూ.10 కోట్లు సొంత నిధులు కార్యకర్తలకు కేటాయించిన నాయకుడు నారాయణ. వీపీఆర్ దంపతుల పేర్లు ఉఛ్ఛరించే అర్హత కూడా అనిల్‌కు లేదు. నెల్లూరు జిల్లాను అనిల్ కుమార్ యాదవ్ సర్వనాశనం చేశాడు. అతడిని ఎమ్మెల్యేని, మంత్రిని చేసింది మా లాంటి కార్యకర్తలే. కానీ ఈ రోజు ఆయన వాళ్లందరినీ వదిలి అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నాడు’’ అంటూ రూప్ కుమార్ నిప్పులు చెరిగారు.
అంతేకాకుండా ఫతేఖాన్ పేటలో కూల్డ్‌డ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్, ఎమ్మెల్యే ఎలా అయ్యారో చెప్పాలని ప్రశ్నించిన రూప్‌కుమార్.. 17 ఏళ్లు షిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తికి.. అదే పోస్టును రూ.7 లక్షలకి అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వెళ్తున్న కార్పొరేటర్లని టీడీపీలోకి వద్దు, జనసేన పార్టీలోకి వెళ్ళమని చెబుతూ అనిల్ వైసీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.