- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారంటూ.. హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2022 లో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా.. చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై వివాదాస్పద పోస్టులు పెట్టాడు. తాజాగా వాటిపై ఫిర్యాదులు అందటంతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై స్పందించకుండా.. విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్న ఆర్జీవీ.. తాజాగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పోలీసులు తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారని, తనపై FIRలు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్జీవీ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆర్జీవీ.. బుధవారం ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఒక వేళ పోలీసులు అరెస్టు చేస్తే..జైల్లో కూర్చుని సినిమా స్టోరీలు రాసుకుంటానని చెప్పుకొచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రతీకార చర్యలు తీసుకోరని.. అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలు గెలవడంతో వారు అందరిపై ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పుకొచ్చారు.