సర్పంచ్‌ల జేఏసీ ఆందోళన..సచివాలయం వద్ద ఉద్రిక్తత

by Y. Venkata Narasimha Reddy |
సర్పంచ్‌ల జేఏసీ ఆందోళన..సచివాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల జేఏసీ ఆందోళకు దిగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. సర్పంచ్‌ల జేఏసీ సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు.. సర్పంచ్ లకు మధ్య వాగ్వివాదం తోపులాట నెలకొంది. దీంతో సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు సర్పంచ్ లను, జేఏసీ నాయకులను బలంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. 12769 గ్రామ పంచాయతీలలో 1500కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు.

Next Story

Most Viewed