- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss -8: ఎలిమినేట్ అయ్యాక ఎమోషనల్ వీడియో విడుదల చేసిన అభయ్! (పోస్ట్)
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్-8 షోలో మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశాడు. రెండు వారాలు తన గేమ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు మిగతా కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీనిచ్చాడు. అంతేకాకుండా అందరితో కలిసి మెలసి ఉన్నాడు. ఇగ క్లాన్‌కి లీడర్‌గా వ్యవహరించి తన టీమ్‌కు సలహాలు, సూచనలు ఇచ్చాడు.
కానీ ఈ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో మాత్రం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. దానికి నాగార్జున కూడా సీరియస్ అయి డోర్స్ ఓపెన్ చేపించి బయటకు పొమ్మన్నాడు. ఆ తర్వాత క్షమించమని అడగటంతో హౌస్‌లో ఉంచారు. కానీ ప్రేక్షకులు ఓట్లు వేయకపోవడంతో మూడో వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో.. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభయ్ ఓ వీడియో విడుదల చేశాడు.
‘‘బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటానని అనుకున్నారు. కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు క్షమాపణలు అడుగుతున్నాను. వెళ్లే ముందు నేను చెప్పాను దిల్ దార్‌గా ఉంటా అని. నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తూ బయటకు వచ్చాను. నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇప్పటి నుంచి సినిమాలతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. సోషల్ మీడియా ద్వారా మీకెప్పుడూ టచ్‌లోనే ఉంటాను. మీ అభయ్ నవీన్ లవ్ యూ’’ అని చెప్పుకొచ్చాడు.