- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెల్ కమ్ సార్...! నేను రెడీ..!!
దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్‌లోని అభివృద్ధి పనుల ప్రారంభానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. కేటీఆర్‌తో పాటు మల్లారెడ్డి, మేయర్ కావ్య డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డులో లీచెడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం, 58&59 జీఓలకు అర్హులైన వారికి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రానున్నారు. క్రమంలో ప్రధాన రోడ్డులో స్థానిక నేతలు భారీ కటౌట్లు, ఏర్పాటు చేశారు. అధికారులు సైతం పక్కా ప్రణాళికలు, భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగానే నేను మీ రాక కోసం రెడీ అవుతున్న సార్.. అంటూ ప్రధాన రోడ్డు డివైడర్ మీదే తన కట్టు బట్టలతో దర్శనిస్తున్నాడు ఓ వ్యక్తి. తనకు ఇల్లు ఏర్పాటు చేసి తనకు పట్టా ఇస్తారేమో అనే కాబోలు ముస్తాబు అవుతున్నాడు. ప్రధాన రోడ్డు డివైడర్ మీద తన బట్టలతో ఉంటూ..అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ.. ఎన్నో రోజులుగా ఉంటున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ మానసిక స్థితి సరిగ్గలేక అలా రోడ్లమీద తిరుగుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.
సొంతింట్లో కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దీనికోసం అన్ని వదిలేసి కుటుంబ పోషణ, పిల్లల చదువు, సొంతింటి కళ, సామాజిక హోదా కోసం నానా కష్టాలు పడుతుంటారు ఎంతో మంది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 90 శాతం మంది ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నవారే. తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక రోడ్డుపైన పడుకుని ఉపాధి కోసం ప్రయత్నించిన వారు ఎందరో. కానీ జీవన పోరాటంలో కూడు, గూడు, విద్య, ఆరోగ్యం వంటి తమ బలమైన కోరిక ముందు...తాము పడ్డ కష్టాలేవి కనిపించలేదని ఇక్కడి నిరుపేదలు వాపోతున్నారు.
ఇలా రోడ్డు డివైడర్ మీదే తన జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూనే ఉన్నారు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కొందరు స్థానిక నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, మహనీయుల స్ఫూర్తి సూక్తులు ప్రజనుద్దేశించి ప్రసంగించారు. ఓ మానసిక స్థితి లేని మనిషిపై వారి దృష్టి పడలేదు. అధికార పార్టీ నేతలు గొప్పలకు కటౌట్లు ఏర్పాటు చేస్తూ అర్బాటాలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.