నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ చెత్తాచెదారాన్ని తొలగిస్తాం: KTR

by Mahesh |   ( Updated:2024-08-20 07:48:20.0  )
నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ చెత్తాచెదారాన్ని తొలగిస్తాం: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: సోమాజిగూడలో రాజీవ్ గాందీ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తొలగించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థలంలో KTR వాళ్ళ అయ్య విగ్రహం పెట్టాలి అనుకున్నాడు. KCR సచ్చేది ఎప్పుడు.. ఆ విగ్రహం అయ్యేది ఎప్పుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా సీఎం వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. " నా మాటలు గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి.. డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్త చెత్త చెదారాన్ని.. తాము మళ్లీ కార్యాలయంలోకి వచ్చిన రోజునే తొలగిస్తాం." అని రాసుకొచ్చారు. అలాగే నీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని అర్థం చేసుకోగలడని ఆశించలేం, బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నిజమైన ఆలోచన చూపుతుంది. మీరు ఈ మానసిక వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని తన ట్వీట్ కేటీఆర్ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed